హైదరాబాద్ : ఒంటిపై కిరోసిన్( kerosene) పోసుకొని ఓ మహిళ బలవన్మరణానికి(Committed suicide ) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరి(Venkatagiri)లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం యాదమ్మ (53) అనే మహిళ శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మ హత్య చేసుకుంది.
ఆమె జీహెచ్ఎంసీ ఔట్ సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉండగా ఇటీవల ఓ కొడుకు చనిపోయినట్లు తెలిసింది. అయితే మృతికి కారణాలు తెలియారాలేదు. మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.