బండి మీద వెళ్లేటపుడు తలకు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు. కానీ చాలా మంది పెట్టుకోరు. పైగా చలాన్ వేస్తే పోలీసులను తిడుతుంటారు. ప్రాణాల మీదికి వస్తే కానీ తెలియదు హెల్మెట్ విలువ. కొంత మందైతే చాలాన్కు చిక్కకుండా నెంబర్ ప్లేట్‌ను కవర్ చేస్తారు కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోరు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లేనందువల్లే చనిపోయాడు… సీటు బెల్ట్ పెట్టుకునుంటే బతికేవాడు అని టీవీల్లో పేపర్లలో వార్తలు చూస్తుంటారు కానీ హెల్మెట్ మాత్రం ధరించరు.
తనదాకా వస్తే కానీ అర్థంకాదన్నమాట. ఫ్రభుత్వాలు, కోర్టులు, పోలీసులు హెల్మెట్ ధరించండని మొత్తుకున్నా కొంత మందికి అవేమి పట్టవు. పైగా బండి ఆపితే కోపం వస్తుంది. పోలీసులపై తిరగబడతారు కానీహెల్మెట్ పెట్టు కోరు. కింద వీడియో చూడండి హెల్మెట్ విలు ఏంటో తెలుస్తుంది. అదే కనక లేకపోయుంటే తలకాయ పదిముక్కలయ్యేది.హెల్మెట్ లేకపోతే తల పది ముక్కలయ్యేది… చూడండి వీడియో
@HYDTP @TelanganaCOPs @HiHyderabad pic.twitter.com/T5aI7tjLWT
— Vema Reddy (@vemaareddy) September 15, 2022