సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌కు ఊపిరి పోయాల్సిన మొకలు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు వదులుతున్నాయి. చిన్న, చిన్న సాప్లిగ్స్ నుంచి పెద్ద మొక్కల వరకు నీటి కొరతతో ఎండిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో కనీసం రోజువారీ నీటి సరఫరా లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతున్నది. జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ అధికారులు నర్సరీలపై పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణం.
ఇందిరాపారులోని నర్సరీలో నీళ్లు లేక అనేక మొక్కలు ఎండిపోయాయి. నర్సరీల నిర్వహణకు లక్షలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. మొక్కలకు కనీసం నీటిని అందించే వారు కరువయ్యారు. ఇందిరాపార్కు నర్సరీల్లో లోపాలను పరిశీలిస్తే గ్రీన్ నెట్స్, షేడ్హౌస్లు సరిగా ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల గ్రీన్ షెడ్స్ ఉన్నా అవి మూలకు పడేసి ఉపయోగించకుండా వదిలేశారు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ వ్యవస్థలు అమలు చేయకపోవడంతో ఉన్న నీటిని కూడా సమర్థంగా వాడలేకపోతున్నారు. ఎరువుల సరఫరా, సంరక్షణ చర్యలు అసలే లేవు. మొకల వేర్లు బయటకు కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదు.
అర్బన్ బయో డైవర్సిటీ విభాగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. నర్సరీల వద్ద కార్మికులు కనిపించడం లేదు. మెయింటెనెన్స్ రిజిస్టర్లు, నీటి సరఫరా వివరాలు కేవలం కాగితాలపైనే అద్భుతంగా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని స్థానికులు, వాకర్లు మండిపడుతున్నారు. లక్షల రూపాయల బిల్లులు మాత్రం చకచకా క్లెయిమ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా వన మహోత్సవం కోసం ప్రభుత్వ నర్సరీల నుంచే మొకలు వెళ్లాలి. కానీ ఇకడ మొకలు చనిపోతుండటంతో.. బల్దియా అధికారులు అడ్డదారి తొకారు. ప్రైవేట్ నర్సరీల నుంచి లక్షలు ఖర్చు చేసి మొకలు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.