Hyderabad | హైదరాబాద్ : వచ్చే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలో(ఒక రోజు), సౌత్‌జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.