Wine shops | సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): శనివారం (మార్చి 11) సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు నగరంలో వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ అదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న (ఆదివారం) హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ ఈ ఉత్తర్వులిచ్చింది.