మన్సురాబాద్ : మన్సురాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేస్-1 లో త్వరలో పునరుద్ధరించనున్న శ్రీ ఎల్లమ్మ, బంగార పోచమ్మ దేవాలయ నిర్మాణ పనుల పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్జెస్ కాలనీ ఫేస్ -1 లో నిర్మించనున్న దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
గ్రామదేవతల ఆలయాల పునరుద్ధరణకు కాలనీవాసులు ముందుకు రావడం ఎంతో అభినందనీయ మన్నారు. ఆలయాల అభివృద్ధితో కాలనీలో ఆధ్యాత్మికమైన వాతావరణం నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య గౌడ్, బాలయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.