Lavu Rathaiah | ఇంజనీరింగ్ విద్యార్థులు పనికి రారంటున్న వాళ్లకు బ్రెయిన్ లేదు : డాక్టర్ లావు రత్తయ్య
lavu rathaiah | దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు పనికి రారంటున్నారు. అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్ లేదని విజ్ఞాన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ లావు రత్తయ్య అన్నారు.
Lavu Rathaiah | ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు.. సంవత్సరానికి లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. ఓ వైపు విద్యార్థులు, మరోవైపు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో.. దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు పనికి రారంటున్నారు. అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్ లేదని విజ్ఞాన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ లావు రత్తయ్య అన్నారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పుడూ కూడా పనికిరాని వారు కాదు. రెండు మూడు కేసుల్లో కానీ, ఓ ఐదారు శాతం కానీ ఉండొచ్చు. వారిలో ఎక్కువ మంది సుమారు 80 శాతం ప్రొడక్టివ్.. అంతకంటే ఎక్కువ పోటీతత్వం ఉన్నవాళ్లు. వారు యూఎస్‌కు వెళ్తున్నారు. వారిలో ఒక్క విద్యార్థి కూడా డిగ్రీ లేకుండా ఇండియాకు తిరిగొస్తలేరన్నారు. ఈ విద్యార్థులు ఎక్కువ ఫోకస్ ఉన్నవాళ్లు, కష్టపడే తత్వం ఉన్నవాళ్లని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నబాధ్యత గల వ్యక్తులు ఎలా వారిని పనికిరాని వారని అంటారో నాకు తెలియదని లావు రత్తయ్య పేర్కొన్నారు.
యువతకు బాగా కనెక్ట్ అయిన కేటీఆర్..
యువత పవర్ ఏంటో ఇటీవలే జంతర్ మంతర్‌లో, తమిళనాడు ఎన్నికల్లో కూడా చూశామని ఆయన అన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన స్వాతంత్ర్య ఉద్యమం లాంటిది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తే పారిపోకుండా పోరాడిన నిరసనకారులను స్వాతంత్ర్య ఉద్యమంలో చూశాం, మళ్లీ మొన్న జంతర్ మంతర్ వద్ద చూశామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ నాయకులు గతంలో లాగా నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఇప్పుడున్న యువత కేవలం డాటా చూసి ఊరుకోరు.. కచ్చితమైన ఆధారాల సేకరణ, డేటా విశ్లేషణ తర్వాతే యువత ఓటు వేస్తారు. కేటీఆర్ యువతకు బాగా కనెక్ట్ అయి ఉన్నాడని.. అది ఏదో ఒక మార్పును సూచిస్తుందని అన్నారు. ఇదే తరహాలో డేటా విశ్లేషణతో మాట్లాడుతూ కేటీఆర్ యువతకు బాగా కనెక్ట్ అయి ఉన్నారని అన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులు పనికిరారు అని కొందరు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అంటున్నారు
అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్ లేదు
కేటీఆర్ యువతకు బాగా కనెక్ట్ అయి ఉన్నాడు
యువత పవర్ ఏంటో ఇటీవలే జంతర్ మంతర్‌లో, తమిళనాడు ఎన్నికల్లో కూడా చూశాము
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన స్వాతంత్ర్య ఉద్యమం… https://t.co/encJn5c45H pic.twitter.com/2w39PWYcox
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2026
Read Also :
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

