సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ): చిరుధాన్యాల వినియోగం, సాగుపై విస్తృతంగా కృషి చేస్తున్న ఇక్రిసాట్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ ప్రోగ్రాంలో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇక్రిసాట్ కలిసి మిల్లెట్ ప్రాసెసింగ్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 2 వరకు ఔత్సాహిక మహిళలు, యువతకు శిక్షణనివ్వనున్నారు. వివరాలకు పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.