సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 ( నమస్తే తెలంగాణ ): వరుసగా కురుస్తున్న వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నారు. దీంతో వెనుకలా వచ్చే వాహనాలు సైతం ప్రమాదానికి గురవుతున్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వానకాలంలో డ్రైవింగ్ చేయడం, వాహన మెయింటెనెన్స్ చాలా కీలకమని మెకానికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టైరులో గాలి ఎంత ఉండాలి? ఎయిర్ ప్రజర్ లోపం ఉంటే ఏమవుతుంది? టైర్ల నాణ్యత ఎలా తెలుసుకోవాలి? తదితర వాటిపై వాహనదారులకు తక్కువ అవగాహన ఉంటుంది. ఫలితంగా వాహనం కండిషన్ ఎలా ఉన్నప్పటికీ డ్రైవ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాహన టైర్లు మంచి కండిషన్లో లేకపోతే చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టైర్ల గ్రిప్ చెక్ చేసుకోవాలి
– నాయుడు, మారుతీ షోరూం
టైర్ల పనితీరు సరిగా లేకపోతే స్కిడ్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. సడెన్ బ్రేకులు వేసినా ప్రమాదమే. అందుకే టైర్ల పనితీరు బాగుండేలా చూసుకోవాలి. కారు మోడల్‌ను బట్టీ టైర్లు.. వాటి పరిమాణాన్ని బట్టీ ఎయిర్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా 32 పాయింట్లతో గాలి నింపుతే సరిపోతుంది. ఒక్కో వెహికిల్‌లో ఒకటి రెండు పాయింట్లు ఎక్కువ తక్కువ ఉంటాయి. కారును ఎక్కువగా వినియోగించని వాళ్లు కనీసం పది నుంచి 15 నిమిషాలు కారును స్టార్ట్ చేసి ఉంచాలి. దీనివల్ల టైర్లు డ్యామేజీ అవకుండా ఉంటాయి. కారు బ్రేకుల పనితీరు తగ్గితే వెంటనే మెకానిక్కు చూపించాలి. వర్షంకాలంలో బ్రేకులు త్వరగా క్షీణిస్తాయి.
చక్రాలు సాఫీగా తిరగాల్సిందే..!