సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మీకు పార్సిల్ వచ్చింది… మేం ఆర్టీసీ, రైల్వే నుంచి మాట్లాడుతు న్నాం… మీరు ఓటీపీ చెబితే చిరునామా ధ్రువీకరించుకొ ని.. పార్సిల్ పంపిస్తామంటూ మెసేజ్‌లు, సెల్ఫోన్లకు ఫోన్లు చేస్తూ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా సైబర్‌నేరగాళ్లు నయా పంథాలో వాట్సాప్‌ను హ్యాక్ చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నట్లు సైబర్ నిపుణు లు చెబుతున్నారు.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌కు స్పందించి ఓటీపీలు చెప్పొద్దం టూ సూచనలు చేస్తున్నారు. వాట్సాప్ హ్యాక్ అయ్యిందం టే .. మన వాట్సాప్‌లో ఉండే కాంటాక్ట్స్ అన్నీ సైబర్‌నేరగాళ్ల చేతికి వెళ్లిపోతున్నాయి.. ఇలా ఆ కాంటాక్టులతో నేరాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్లు.. మీ సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపించి.. ఆ వెంటనే ఓటీపీ పంపిస్తారు.. మీరు వాడే ఫోన్ నంబర్ వాట్సాప్‌ను మరో ఫోన్లో యాక్టివేట్ చేసుకోవడానికి ఆ ఓటీపీ అవసరముంటుంది… మీ నంబర్‌ను సైబర్నేరగా డు యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.. ఎప్పుడైతే మీరు ఓటీపీ చెబుతారో… వెంటనే మీ వాట్సాప్ మీ సెల్ఫోన్లో డియాక్టివేట్ అయి..సైబర్‌నేరగాడి చేతిలో ఉన్న ఫోన్లో యాక్టివేట్ అవుతుంది. దీంతో మీ సెల్ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్నీ అవతలి ఫోన్లోకి వెళ్లిపోతాయి. అందులో ముఖ్యమైన మెసేజ్‌లు, ఫొటో లు దొరికితే దాని ద్వారా బ్లాక్మెయిల్ చేస్తుంటారు.. లేదా కాంటాక్టులో ఉన్న వారందరికీ అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయంటూ మెసేజ్‌లు పంపిస్తుంటారు…ఇలా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మోసానికి పాల్పడుతున్నారు..
తాజాగా మీకు పార్కిల్ వచ్చింది.. మీ అడ్రస్‌కు పంపించడానికి.. మీ నంబర్‌కు ఓటీపీ వచ్చింది.. అది చెప్పండంటూ మెసేజ్‌లు, ఫోన్లు చేస్తుంటారు.. దీనికి ఎవరైనా స్పందించి ఓటీపీలు చెప్పిన వెం టనే మీ ఖాతాలోని డబ్బులు కాజేస్తారు.. అలాగే.. బాధితులకు నిమిషానికో ఫోన్ చే స్తున్నా స్పందించకపోతో.. ఫలాన వ్యక్తిని మాట్లాడుతు న్నా.. మీకు వచ్చిన ఓటీపీని చెప్పండంటూ కోరుతారు… అలా ఓటీపీ చెప్పగానే ఫోన్ నంబర్ మరో నంబర్‌కు ఫా ర్వర్డ్ అవుతుంది.. ఎవరైనా దానికి ఫోన్‌చేస్తే ఫోన్ నంబర్ ఫార్వర్డ్ అయ్యిందంటూ మెసేజ్ వస్తూ మరో నంబర్‌కు కాంటాక్టు అయ్యే ప్రయ త్నం జరుగుతుంది..
అయితే ఫా ర్వర్డ్ అయిన నంబర్ స్విచ్ఛాఫ్ ఉంటుంది. దీంతో ఎవరైనా ఫోన్ చేస్తే ఆ నంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉంటుంది. ఇదిలాఉండగా వాట్సాప్‌లో డబ్బులు కావాలంటూ మెసేజ్ పెట్టే వాళ్లు .. నా నంబర్ పనిచేయడం లేదు.. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ కారణం చెబుతూ, బ్యాంకు ఖాతా నంబర్, జీపే నంబర్ పంపిస్తారు.. ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవడం కోసం డబ్బులు ఇవ్వాలనుకునే వాళ్లు ఫోన్‌చేస్తే నిజంగానే ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంటుంది. దీంతో వచ్చిన వాట్సాప్ మెసేజ్ నిజమేనేమో అనే ఉద్దేశంతో డబ్బులు పంపిస్తూ చాలా మంది మోసపోతుంటారు.
ఓటీపీలు చెబితే అంతే..!
ఎలాంటి ఆర్డర్ ఇవ్వకున్నా.. మన ఫోన్లకు అప్పుడప్పుడు ఓటీపీ నంబర్లు వస్తుంటాయి. గుర్తుతెలియని వ్యక్తు ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌తో పాటు సంబంధం లేకుండా వచ్చే ఓటీపీలకు స్పందించవద్దని సైబర్‌క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ కోసమే కాకుండా వివిధ నేరాలకు సైబర్‌నేరగాళ్లు ఓటీపీలను ఉపయోగిస్తుంటారని, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడం, మెసేజ్ పంపిచ్చినప్పుడు స్పందించకపోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.