హైదరాబాద్, ఫిబ్రవరి 23 : యూసుఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ఆధ్వర్యంలో బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్ కేర్, వెలనెస్లో నైపుణ్యంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీ లైక్ అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్‌తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్సా ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.
బ్యూటీ పరిశ్రమపై ఆసక్తి ఉన్న వ్యక్తులను ప్రేరేపించడం, వారికి అగాహన కల్పించడంతో పాటు బ్రైడల్ & హెయిర్ మేకప్ ట్రైనింగ్ ప్రాధాన్యంగా ప్రపంచం స్థాయి లో ట్రెయిన్డ్ స్పెషలిస్ట్ గా తయారు చేయడమే తమ లక్ష్యం అని వీలైక్ మేకప్ & హెయిర్ అకాడమీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ముమైత్ ఖాన్ అన్నారు.
నేటి తరంతో పాటు భవిష్యత్ తరం నిపుణులను ప్రోత్సహించడానికి సమగ్ర పాఠ్య ప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు, ప్రముఖ బోధనా బృందంతో వీలైక్ సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక వివ్వాసంతో విద్యార్థులను నైపుణ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మక శిక్షణ ద్వారా విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వారి కెరీర్‌ను మలచడంలో సహాయపడగలమని విశ్వసిస్తున్నామని వీలైక్ కో ఫౌండర్స్ కెయిత్, జావేద్ లు తెలిపారు.
ఈ వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ అధునాతన బ్రైడల్ హెయిర్ & మేకప్ కోర్సులు, హెయిర్ స్టైలింగ్ పద్ధతులు, మేకప్ ఆర్టిస్ట్రీ, చర్మ సంరక్షణ చికిత్సలు, నెయిల్ టెక్నాలజీతో సహా అనేక రకాల ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ప్రతి ప్రోగ్రామ్ ఆవిష్కరణ, సృజనాత్మకతను పెంపొందించేటప్పుడు ప్రస్తుత పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. వాస్తవ ప్రపంచ సెలూన్ అనుభవాలను అనుకరిస్తూ, పోటీ మార్కెట్లో రాణించడానికి విద్యార్థులను సిద్ధం చేస్తున్నది. విద్యార్థులు అందరూ తమ విశిష్టమైన కళాత్మక దృక్పథాలను వ్యక్తీకరించడానికి శక్తివంతంగా భావించే వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు.