
మారేడ్పల్లి, డిసెంబర్ 29 : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో 10 మంది లబ్ధిదారులకు, అదేవిధంగా కంటోన్మెంట్ రెండో వార్డులోని కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ భవనంలో 19 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి. సాయన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు ఆకుల హరికృష్ణ, పిట్ల నాగేష్ ముదిరాజ్, జయరాజ్, ఒదెల అజేయ్, నవీన్, సుజన్ ముదిరాజ్, కసిరెడ్డి నరేందర్రెడ్డి, సదానంద్గౌడ్, ఉమా శంకర్, గౌరీశంకర్, మహిళా నాయకురాలు నివేదిత, చిత్రలేఖ, అనిత తదితరులు పాల్గొన్నారు.