శామీర్‌పేట, ఆగస్టు 26: సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం 2లక్షల, 83 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని అన్నారు. రైతాంగ, కులవృత్తులతో పాటు సంబండవర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కాలేశ్వరం ప్రాజెక్టు, కల్యాణలక్ష్మి, నిరంతర విద్యుత్ సరఫరా, ఆసరా పింఛన్ వంటి మహత్తర పథకాలతో పాటు 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలు, పనిముట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువు అభివృద్ధి చేయడం, హరితహారంతో వాతావరణ సమతుల్యతతో నేడు సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయ అన్నారు. మేడ్చల్ పెద్ద చెరువులో 99 వేలు కట్ల, రవ్వు 99 వేలు, బంగారు తీగ 85 వేలు చేప పిల్లలు వదలడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జడ్పీటీసీ శైలజవిజయనందారెడ్డి, ఎంపీపీ రజితరాజమల్లారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికనర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్,మత్స్యశాఖ జిల్లా అధికారిని పూర్ణిమ, మేడ్చల్ మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు బాలనర్సింహ, మేడ్చల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బెస్త,మత్స్యశాఖ సంఘం నాయకులు, పాల్గొన్నారు.
స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలి
తూంకుంట మున్సిపాలిటీలో ఎన్ఏసీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుట్టు శిక్షణ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తామన్నా రు. కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వాణివీ రారెడ్డి, కౌన్సిలర్లు మధుసూదన్‌రెడ్డి, రాజ్కుమార్యాదవ్, కో ఆఫ్షన్ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బాబు, నరేశ్, ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ
మేడ్చల్ కలెక్టరేట్: అభివృద్ధిలో అగ్రగామిగా మేడ్చల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో రూ. 2 కోట్ల 47 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలోని 1వ వార్డులో రూ.30 లక్షలు, 2వ వార్డులో రూ.30 లక్షలు, 3వ వార్డులో రూ.30 లక్షల నిధులతో ఓవర్ హెడ్ ట్యాంకులు, భవనాలకు పెయింటింగ్ పను లు, 4వ వార్డులో రూ.7 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మా ణం, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, 8వ వార్డులో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, 17వ వార్డు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, 18వ వార్డులో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డులో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ప్రణీతశ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి కౌన్సిలర్లు నానునాయక్, సుజాత, హేమలత, వెంకటేశ్, సురేఖ, పావనీరెడ్డి, స్వప్న, వెంకటరమణ, రమేశ్ గౌడ్, నరసింహారెడ్డి, మౌనిక, శ్రీహరిగౌడ్, నాయకులు శ్రీకాంత్ గౌడ్, హరిగౌడ్, నరహరి రెడ్డి, సాయి గౌడ్, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
ఘట్కేసర్ రూరల్: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి చౌదరిగూడ పంచాయతీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ, పోచమ్మ, ఈదమ్మ ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కొర్రెములలోనూతనంగా నిర్మించిన మ హంకాళి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
చౌదరిగూడ పంచాయతీ పరిధి విజయపురి కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్నిర్మాణానికి శనివారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం కొర్రెములలో 30 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు భద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, చౌదరిగూడ సర్పంచ్ రమాదేవి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.