సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆవర్తన ప్రభావంతో నగరంలో శనివారం సాయంత్రం పటాన్చెరు, ఆర్సీపురం, పాశమైలారం, బీహెచ్ఈఎల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. రాత్రి 8గంటల వరకు పటాన్చెరు, ఆర్సీపురంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఆవర్తన ప్రభావంతో రాగల మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.