LB Nagar | ఎల్బీనగర్ : అనాథల పిల్లలను ఆదుకుంటామని బీఆర్ఎస్ నేత ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఫణిగిరి కాలనీ ఆదర్శ ఫౌండేషన్ పిల్లల స్కూల్ ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయంటూ నిర్వాహకుడు ప్రదీప్ సహాయం కోరారు. దాంతో ఆయన మిత్రులతో సహకారంతో కలిసి రూ.75వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఆదుకునేందుకు తన మిత్రులకు అభినందనలు తెలిపారు. ప్రశాంత్‌రెడ్డి, కల్యాణ్, వీరణ్, వేణు, సూర్య, సురేశ్, నరేందర్ కలిసి రూ.75వేల చెక్‌ను ఫౌండేషన్‌కు చెక్ రూపంలో అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించేందుకు ముందుకువచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.