MLA Sudheer Reddy | ఎల్బీనగర్, అక్టోబర్ 5: మూసీ నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ.. కొత్తపేట, చైతన్యపురి డివిజన్ల పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల నిర్వాసితుల పక్షాన తాము ముందుండి పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున మూసీ నిర్వాసితుల కోసం అడ్వకేట్స్ ప్యానల్ ఏర్పాటు చేశామని, వారి తరపున కోర్టులో వీరు పోరాటం చేస్తారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మూసీ సుందరీకరణలో పెద్ద ఎత్తున ప్రజల నివాసాలు పోతాయని సర్వేలో తాము గుర్తించి..అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి మూసీ బోర్డు చైర్మన్‌గా తాను, కేటీఆర్ సూచిస్తే పేదలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం వద్దంటూ కేసీఆర్ సూచించారని, ఎక్కువ నష్టం కలుగకుండా ఎలా చేద్దామని ఆలోచన చేసే క్రమంలోనే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయిందన్నారు.