హైదరాబాద్ : మహిళలు, పిల్లల రక్షణ కోసం అదేవిధంగా వారికి సహాయంగా రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమశాఖ భరోసా కేంద్రం ఏర్పాటు చేసి నేటికి ఐదేళ్లు. ఈ సందర్భాన్ని పూర్తిచేసుకుని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్స్), షీ టీమ్స్, భరోసా సెంటర్స్ ఇంఛార్జీ శిఖా గోయల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఐదేళ్లలో తాము పది వేల మంది మహిళలు, పిల్లలకు సహాయం అందించినట్లు తెలిపారు. బాధితులు న్యాయం పొందడంలో, కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో భరోసా సిబ్బంది సహాయంగా ఉన్నారన్నారు. వారి నిస్వార్థ సేవకు తామంతా వందనం చేస్తున్నట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు.
Celebrating 5 years of BHAROSA, Hyderabad
— Shikha Goel, IPS (@Shikhagoel_IPS) May 7, 2021
In these years we have helped almost 10K clients
The BHAROSA staff have assisted women and children who have been victims of crime in getting justice and also in starting a new life
We salute them for their selfless service @bharosahyd pic.twitter.com/N4aiYgYfFw