KTR | అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడి చేసిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆధ్వర్యంలో ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ శుక్లాకు ఫిర్యాదు చేశారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని వివరించడానికి వారిని సమయం అడిగాం.. మాకు సమయం ఇచ్చారు. వారికి మా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి చిన్న ఆరోగ్యసమస్య వచ్చింది.. వారు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్పూర్తిగా మా పార్టీ తరపున ఆకాంక్షను తెలియజేశామన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్ని అన్ని పరిస్థితులను గవర్నర్కు కూలంకషంగా మా పార్టీ శాసనసభ్యులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, ఉప నాయకులు, సీనియర్ నాయకులు అంతా కలిసి చాలా వివరంగా గవర్నర్కు చెప్పామన్నారు.
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనలో ప్రజలకు అన్యాయమే జరిగిందని నల్ల టీ-షర్టులు ధరించి నిరసన తెలుపుతుంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు దాడి చేసిన తీరును గవర్నర్కు చెప్పామన్నారు. తెలంగాణలో పరిస్థితులను గవర్నర్కు వివరించామన్నారు. సబితా ఇంద్రారెడ్డి పురుష పోలీసుల దాడి వీడియోలను చూపించాం. తెలంగాణలో పరిస్థితులను గవర్నర్కు వివరించామన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను తెలిపామన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్వాసనపర్వం ఎలా సృష్టించారో చెప్పామన్నారు. కేసీఆర్ చావు కోరుతూ ఎలా మాట్లాడారో గవర్నర్కు చెప్పామన్నారు.
రూల్స్ కు విరుద్ధంగా తమ ఎమ్మెల్సీలను ఎలా సస్పెండ్ చేశారో గవర్నర్ శుక్లాకు చెప్పామన్నారు కేటీఆర్ . గౌరవ సభ కాదది, కౌరవ సభ, శాసన సభ కాదు.. దుశ్శాసన సభ, అదే విషయాన్ని గవర్నర్కు వీడియోలతో సహా వివరించామన్నారు. సభ బయట అంశాలపైడీజీపీ, సీపీతో గవర్నర్ మాట్లాడతానన్నారు. ఫామ్ హౌస్కు కాంగ్రెస్ గూండాలు ఎలా వెళ్లారో గవర్నర్కు చెప్పామన్నారు. రాహుల్ గాంధీ తరహాలోనే బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాం. మేం చేసిన తప్పేంటి.. తెలంగాణలో పరిస్థితులను గవర్నర్ శుక్లాకు వివరించాం. రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ప్రజా ప్రతినిధులకూ అవమానాలే ఎదురవుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
LIVE: గవర్నర్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRShttps://t.co/t41OwagLP0
— BRS Party (@BRSparty) September 9, 2026