సుల్తాన్‌బజార్ : తెలంగాణ మలిదశ ఉద్యోగ నాయకుడు, స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన రాష్ట్ర క్రీడా,ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్రను టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం నాంపల్లిలోని గృహకల్ప ఆవరణలో జిల్లా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌అలీ, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ యంత్రాంగానికి శిరస్సు వంచి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
వి శ్రీనివాస్ గౌడ్ పై ఓర్వలేకనే కొందరు రాజకీయ దుష్టశక్తులు హత్యకు కుట్ర పన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బంగా రు తెలంగాణ నిర్మాణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవసరం ఎంతో ఉందన్నారు. ఈ రాజకీయ కుట్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్‌కుమార్,కోశాధికారి జే బాలరాజు,ఉపా ధ్యక్షులు కేఆర్ రాజ్‌కుమార్, ఉమర్ఖాన్, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, కార్యాలయ కార్యదర్శి ఎస్ మురళీరాజ్, సభ్యులు నరేష్, శంక ర్, ఎంఏ ముజీబ్,వైదిక్ శస్త్ర,గీతా సింగ్, మాజీ కార్యదర్శులు ప్రభాకర్, దేవేందర్‌తో పాటు వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు,ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.