Ponnam Prabhakar | హైదరాబాద్ : ఆర్టీసీ కళాభవన్‌లో నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ దివంగత కోలా శంకర్ కుటుంబ సభ్యులకు TGSRTC ఉద్యోగుల చేయూత కార్యక్రమం ద్వారా 90 లక్షల 85 వేల 500 రూపాయల చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ సతిమతి హేమలత ,కుమారుడు హేమంత్, కుమార్తె షాలిని ఇక్కడికి వచ్చారు.. ఆ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా ఉన్నారు.. ఆర్టీసీ లో ఒక్కొక్క సమస్య పరిష్కారం చేస్తున్నాం.. తెలంగాణ ఉద్యమకారుడిగా ‘నై చెలెగ బస్ క పయ్యా’ అని మీరు ఉద్యమం చేశారు.. సంఘాలు ఎత్తివేశారు.. మహా లక్ష్మీ పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి నెలకు ఆర్టీసీకి 300 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రిటైర్డ్ కార్మికులకు మీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మీ అందరూ కలిసి శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పాత ఉమ్మడి జిల్లాల వారిగా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మన విషయంలో సానుకూలంగా ఉన్నారు. మహాలక్ష్మీ భారం పడినా చాలా కష్టపడుతున్నారు. రాఖీ పౌర్ణమి రోజు కూడా మీరు సోదరులకు రాఖీ కట్టి విధులు నిర్వహించారు. సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సంక్షేమం మూడు ప్రధాన అంశాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు..
క్యూర్ ఏరియా పరిధిలో బస్ టెర్మినల్ నిర్మించుకుందాం.. ఎంఎంటీఎస్, మెట్రోకి ఆర్టీసీని అనుసంధానం చేస్తున్నాం..గ్రామాల నుండి రాజధాని వరకు కొత్త రూట్లలో బస్సులు నడిపిస్తున్నాం.. ఆర్టీసీ పేదవాడి గుండె చప్పుడు. పేదవాడికి సౌకర్యం ఉండే విధంగా యాజమాన్యం తీసుకుంటున్న చర్యల్లో మరింత బాధ్యతగా పని చేయాలన్నారు. 6 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తున్నారు.. 6 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు.
శంకర్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు అర్దరాత్రి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నాం.. నలుగురు మంత్రులు, అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు ముందుకు పోతాం.ఎన్నికల తర్వాత విలీన ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. శంకర్ కుమారుడు హేమంత్‌కు ఉద్యోగం ఇస్తాం.. వారికి ఇల్లు మంజూరు చేశాం..
శంకర్ గౌడ్ కుటుంబాన్ని నిలబెట్టిన మీ అందరికీ అభినందనలు..సంస్థ అభివృద్ధికి మనమంతా కలిసి శ్రమపడదాం..ఇది పేద ప్రజలకు లైఫ్ లైన్.. ప్రజా రవాణాలో తెలంగాణ ఆర్టీసీ ముందుంటుంది.. కార్మికుల సంక్షేమానికి వెనుకాడమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.