కాచిగూడ, ఫిబ్రవరి 22 : ఆరె కులస్తుల మనోభావాలను గ్రహించి కేసీఆర్ ప్రభుత్వం ఉప్పల్ భగాయత్‌లో ఎకరం భూమి, కోటి రూపాయలు మంజూరు చేయడం పట్ల ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ హర్షం వ్యక్తం చేశారు. ఆరె కులస్తుల కుటుంబాలు జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాయని తెలిపారు. బుధవారం కాచిగూడలోని తుల్జాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ దిగంబరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి పటేల్, మార్జోడు రాంబాబు, మొర్తాల చందర్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణస్వామి, దోనే కిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.