Drinking Water | సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : జలమండలి ఓఅండ్ఎం డివిజన్ -2 బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు ఎస్ఎన్డీపీ డ్రైయిన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బాక్స్ డ్రైయిన్ నిర్మాణానికి ఇబ్బందులు కలుగకుండా బాలాపూర్ రిజర్వాయర్ ఔట్లెట్ 450 ఎంఎం డయా పైపులైన్ డైవర్షన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పనులు శుక్రవారం (నేడు) సాయంత్రం 9 గంటల నుంచి మరుసటి రోజు శనివారం (రేపు) రాత్రి 8 గంటల వరకు జరుగుతాయని చెప్పారు.
ఈ కారణంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. రాజా నరసింహ కాలనీ, ఇందిరానగర్, పిసల్బండా, దర్గా బురాన్షాహి, గాజీ-మిల్లత్, జీఎం చౌని, లలితాబాగ్, ఉప్పుగూడ, డీఎంఆర్ఎల్, డీఆర్డీఎల్, గారిసన్ ఇంజినీర్ -1, 2, డీఆర్డీవో మిధాని, ఒవైసీ హాస్పిటల్, బీడీఎల్, సీఆర్పీఎఫ్ కేంద్రీయ విద్యాలయ, హస్నాబాద్, ఖలందానగర్, సంతోష్‌నగర్ పాత కాలనీ, న్యూ కాలనీ, యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ప్రాంతం, ఎంఐజీహెచ్, హెచ్ఐజీహెచ్, ఎల్ఐజీహెచ్ కాలనీలు, ఫహబా మసీదు, మారుతీనగర్, పోచమ్మ గడ్డ, హనుమాన్ టైలర్ గల్లీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.