సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): నల్లాల నుంచి మోటర్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఓ అండ్ ఎమ్ సీజీఎం, జీఎం లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ… ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో ఈ నెల 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ అమలు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఎవరైనా వినియోగదారులు తమ నల్లాలకు మోటర్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు మోటర్లు సీజ్ చేస్తామని చెప్పారు.