జూబ్లీహిల్స్, జూలై 9: యూసుఫ్ గూడ బస్తీ దవాఖానలో నీటి సమస్యను అధికారులు పరిశీలించారు. ఇటీవల ‘నమస్తే’లో బస్తీ దవఖానాలో నీటి సమస్య శీర్షికన వచ్చిన కథనానికి జలవండలి అధికారులు స్పందించారు. బస్తీ దవాఖాన ప్రారంభించి ఏండ్లు గడుస్తున్నా నీటి కనెక్షన్ ఇవ్వకపోవడంపై సంబంధిత వైద్యాధికారులు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా.. సమస్యకు పరిష్కారం లభించలేదు.
ఈ విషయమై జలమండలి ఎల్లారెడ్డిగూడ సెక్షన్ మేనేజర్ శ్యామ్‌కుమార్ బుధవారం పర్యటించి నీటి సమస్యను పరిశీలించారు. నీటి కనెక్షన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చిన్మయి శ్రీరంగ జలమండలి అధికారులకు తెలిపారు. అయితే నిబంధనలకు అనుగుణంగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని.. వెంటనే నీటి కనెక్షన్ ఇస్తామని మేనేజర్ శ్యామ్ కుమార్ వైద్య అధికారులకు సూచించారు.