బంజారాహిల్స్, ఏప్రిల్ 22 : జూబ్లీహిల్స్‌లోని నవనిర్మాణ్‌నగర్‌లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘ ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం’ పేరుతో మంగళవారం ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు.
షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403లోకి వచ్చే జూబ్లీహిల్స్ రోడ్ నెం 1 ప్రధాన రహదారిలోని డీఈ షా సంస్థ భవనం వెనకాల సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అసాంఘిక శక్తులు తిష్ట వేస్తుండడంతో పాటు అక్రమంగా పార్కింగ్లు చేస్తున్నారు. మంగళవారం షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డితో పాటు సిబ్బంది నవ నిర్మాణ్‌నగర్ వెళ్లి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అక్రమంగా నిర్మించిన గదిని కూల్చేయడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.