అబిడ్స్, అక్టోబర్ 9: వక్ఫ్‌బోర్డు భూ ఆక్రమణలపై నిగ్గు తేల్చేందుకు సీఎం కేసీఆర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించగా టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు బద్రుద్దీన్, ముతావలీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం హోం మంత్రి మహమూద్ అలీని కలిసి మిఠాయిలు తినిపించారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయలేని పనిని సీఎం కేసీఆర్ చేయడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తుల సమస్యలను సంవత్సరం లోపు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. సబ్బండ వర్ణాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.