హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు(Parliament Elections) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్ రాజ్(Vikas Raj) తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని చెప్పారు. దాంతో కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి ఉండొద్దన్నారు. 3.32కోట్ల మంది ఓటుహక్కు ఓటు వేసేలా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఆదివారం నగరంలోని యాకుత్పురా డీఆర్సీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీని(Election materials) పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు.