సికింద్రాబాద్: ‘ఫైలు కదలాలంటే 3 వేలు ఇవ్వాల్సిందే’ అనే శీర్షికతో శనివారం ‘నమస్తే’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్‌పై వేటు వేశారు. ఉన్నతాధికారులు అతడిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్‌పై లంచం ఇస్తేనే ఫైలు కదులుతుందని, సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కాంట్రాక్టర్లు జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు ఫిర్యాదు చేశారు.
కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్న ప్రసాద్ ప్రతి పనికీ లంచం డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు ముట్టజెప్పనిదే ఏ ఫైలూ ముందుకు కదలని ,అతనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు అతడిని విధుల్లోంచి తొలగించాలని జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జోనల్ కమిషనర్ స్పందించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్‌ను నియమించినట్లు తెలిసింది.