మల్కాజిగిరి/ అల్వాల్, మే 9 : ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీ అభ్యర్థులే విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగుదామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ బీఆర్ఎస్ సమావేశం ప్రశాంతినగర్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్థాగత కమిటీల నిర్మాణం పటిష్టంగా ఉండాలని సూచించారు. డివిజన్ల సమావేశాలు నిర్వహించి, కమిటీలు పూర్తిచేస్తామన్నారు. సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. డివిజన్ల వారిగా సమస్యలను గుర్తించాలని, కాంగ్రెస్ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీయలన్నారు. ఓటరు నమోదు, తొలగింపులపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏకే.మురుగేష్, నేతలు బద్ధం పరుశురాంరెడ్డి, వీరేశం, జేఏసీ వెంకన్న, రావుల అంజయ్య, నర్సింగ్‌రావు, చిన్నయాదవ్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలి
బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సంస్థాగతంగా పని చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం తుర్కపల్లి డివిజన్లోని విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్ కమిటీల నుంచి డివిజన్ స్థాయి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. ప్రజలతో మమేకమై సభ్యత్వ నమోదులో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావుల అంజయ్య, ఖలీల్, భాస్కర్‌రెడ్డి, శోభన్, మహేష్, కృష్ణ, సాయి, దేవేందర్, శ్రీదేవి, వైశాలి, కవిత తదితరులు పాల్గొన్నారు.