సిటీబ్యూరో, మార్చి 21(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కల్పించేలా టీ హబ్, ప్రముఖ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సంస్థ వెంచర్‌బ్లిక్ (Ventureblick) కలిసి పనిచేయనుంది. ఈ మేరకు టీ హబ్‌లో(T-Hub) జరిగిన కార్యక్రమంలో వెంచర్‌బ్లిక్ దక్షిణాసియా ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ కైలాష్ జియాల్దాసాని, వెంచర్‌బ్లిక్ వ్యవస్థాపకుడు సీఈవో క్రిస్ లీ, టీ హబ్ సీవోవో ఆంథోని అనీష్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయంగా ఉన్న దేశాల మధ్య హెల్త్ కేర్ టెక్నాలజీ వినియయానికి ఇదొక సరైన వేదిక అవుతుందన్నారు. అదేవిధంగా వెంచర్‌బ్లిక్ అందించే వైద్య పరికరాలను 70-80శాతం భారత దేశం దిగుమతి చేసుకుంటుందని, ప్రపంచ దేశాలకు వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతను అందించేలా భారతీయ పారిశ్రామికవేత్తలకు ఈ ఒప్పందం ద్వారా ప్రోత్సాహం లభించనుందని తెలిపారు.
మెడికల్ ధృవీకరణ, క్లినికల్ ట్రయల్స్, మార్కెట్ మ్యాపింగ్, రెగ్యులేటరీ ఆమోదాలు, మార్కెటింగ్ వ్యూహాలు వంటి అంశాలపై ఆంత్రప్రెన్యూర్లకు ఈ వేదిక ద్వారా సహకారం అందించనున్నారు. విస్తృతమైన అంతర్జాతీయ మార్కెట్‌తో 60దేశాలకు చెందిన 2వేలకు పైగా వైద్య నిపుణులు, డొమైన్ నిపుణుల నెట్‌వర్క్‌ను కలిగి ఉండగా, టీ హబ్ వేదికగా ఆవిష్కరించే హెల్త్ కేర్ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ దొరికే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.