హిమాయత్‌నగర్: వేంకటేశ్వరస్వామి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు 12 నుంచి 17 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉపకార్యనిర్వహణ అధికారి ఎం.రమేశ్‌బాబు, దాత త్రినాథ్‌బాబు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ బుధవారం హిమాయత్‌నగర్, లిబర్టీ లోని టీటీడీ ఆలయంలో జరిగింది. ఈనెల 12న రాత్రి 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో నిరంజన్, హరి తదితరులు పాల్గొన్నారు.