మాదాపూర్, అక్టోబర్ 21: విశాఖ శారదాపీఠం పాలిత చందానగర్ సముదాయం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు విశాఖ శార దా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి వార్ల పర్యవేక్షణలో పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 5 గంటల నుంచి గణపతి విశ్వక్సేన ఆరాధనలు, పుణ్యహవచనము, సూర్య, గణపతి, విష్ణు రుద్ర, అంబిక, నవగ్ర హ, నారసింహ, రామ, కృష్ణ వేంకటేశ, చండి మంత్రానుష్టానములు, సుందరకాండ పారాయణం, హనుమత్ హోమ కార్యక్రమాలు చేయగా, మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారికి హారతి అందించి తీర్థ ప్రసాదములను అందజేశారు.
సాయంత్రం 5 గంటలకు సంకల్పము, నవగ్రహ పంచాయతన చతుర్యుగ దేవతా ఆరాధనలు, చండీ హోమము, శ్రీ వరాహస్వామి వారికి పంచగవ్యాధి వాస తత్ ప్రధాన హోమములు, రాత్రి 9 గంటలకు హార తి, తీర్థ ప్రసాదములను స్వామి వారికి అందజేశారు. శ్రీవరాహస్వామి, పంచగ వ్యాధి, ప్రధాన హోమం, రుద్ర కల్పము, కళా హోమముతో పా టు చండీయాగాన్ని నిర్వహించారు. కలిదిండి సత్యనారాయణ దంపతులు స్వామి వారికి స్వరాభరణాలు సమర్పించగా, శ్రీనివాసరావు, సుష్మ దంపతులు పద్మావతి గోదాదేవి అమ్మవార్లకు స్వర్ణాభరణములు సమర్పించారు. ఆలయ ప్రధాన కార్యదర్శి సుభాష్, సుమతి దంపతులు భూ వరాహస్వామి శిలా విగ్రహం, వెండి ఆభరణాలు సమర్పించారు.