హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శనివారం రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై లైట్ మోటర్ వాహనాలు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ తెలిపారు. అయితే లైట్ మోటర్ వాహనాలపై ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు ఫ్లైట్ టిక్కెట్లు చూపిస్తే అనుమతిస్తామన్నారు. దీంతో పాటు నాగోల్, కామినేని, ఎల్బీనగర్, ఎల్బీనగర్ అండర్ పాస్, చింతల్‌కుంట అండర్ పాస్‌లను లైట్ మోటర్ వాహనాలకు, ద్విచక్రవాహనాలు, ప్యాసిజంర్ వాహనాలకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అనుమతి ఉండదని తెలిపారు. సాగర్ రింగ్ రోడ్ ఫ్లై ఓవర్‌పై మాత్రం అనుమతి ఉంటుందన్నారు. న్యూ ఇయర్ వేడుకలు ఇన్సిండెంట్ ఫ్రీగా, ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని సీపీ సూచించారు.
క్యాబ్, ట్యాక్స్, ఆటో రిక్షాలు యూనిఫామ్‌లో ఉండి అన్ని డాక్యుమెంట్లను కల్గి ఉండాలి. ప్యాసింజర్లు ఎవరైనా క్యాబ్, ఆటోలు, బుక్ చేస్తే వారిని తిరస్కరించవద్దని, అలా చేస్తే రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. దీనిపై ప్రజలు 9490617111కు వాహనం నెంబర్, సమయం, స్థలంతో పిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల నుంచి ఎక్కువ ఛార్జీలు డిమాండ్ చేయవద్దన్నారు.