త్వరలో వెజ్,నాన్ వెజ్ మార్కెట్లు
మున్సిపాలిటీ ప్రజలకు అన్ని రకాల కూరగాయలు,మాంసం,చికెన్ ఒకే ప్రాంతంలో లభించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.
- రెండు ఎకరాల స్థలం కేటాయింపు
- నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరు
- త్వరలో మంత్రి చేతుల మార్కెట్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఘట్కేసర్,జనవరి 8: మున్సిపాలిటీ ప్రజలకు అన్ని రకాల కూరగాయలు,మాంసం,చికెన్ ఒకే ప్రాంతంలో లభించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.ఈమేరకు అన్ని మున్సిపాలిటీల్లో వెజ్,నాన్ వెజ్ మార్కెట్లను అన్ని అంగులతో, ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఘట్కేసర్ మున్సిపాలిటీలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ సర్వే నంబర్ 224 ప్రభుత్వ స్థలంలో ఈ మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని నిర్ణయించారు.ఘట్కేసర్లోని మాధవ రెడ్డి వంతెన వద్ద నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలంరెండు ఎకరాల 10 గుంటల్లో మార్కె ట్లు ఏర్పాటు చేయాలని అందకు సం బంధించిన ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. త్వరలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించడానికి మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్కెట్లో అత్యాధునిక సౌకర్యాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో వ్యాపారులతో పాటు,వినియోగదారులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సరైన తూకం, తాజాగా లభించడం, సమయానుకూలంగా అందుబాటులో ఉండడం వంటి సౌకర్యాలు వినియోగదారులకు లభించనున్నాయి. వీటితో పాటు విద్యుత్,నీటి సరఫరా, మూత్రశాలలు, మరుగుదొడ్లు,షెడ్లు, సరుకు నిలువ చేసుకోవడానికి,భోజన,విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలు వ్యాపారులకు లభించనున్నాయి.
మరింత అభివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతున్న ఘట్కేసర్ మున్సిపాటీలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు కావడంతో మరింత అభివృద్ధి చెందుతుంది.మున్సిపాలిటీలో ఇప్పటికే ప్రభు త్వం ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పిస్తుంది.త్వరలో అందుబాటులోకి రానున్న జిల్లా స్థాయి మహిళా పాలిటెక్నిక్ భవన నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. త్వర లో100 పడకల దవాఖాన,ఈఎస్ఐ దవాఖానలు ఏర్పాటుతో మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది.
-ముల్లి పావనీ జంగయ్య యాదవ్, చైర్పర్సన్ ఘట్కేసర్ మున్సిపాలిటీ.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

