Job Fair | కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 10 : జేఎన్టీయూహెచ్ వర్సిటీలో నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహించడం అభినందనీయమని, జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ బుర్రా వెంకటేశం అన్నారు. శనివారం జేఎన్టీయూహెచ్ వర్సిటీలో నిపుణ సొసైటీ, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్, రాంకీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాను రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర్రావు, యూఐఐసీ డైరెక్టర్ ఎ.రజనీ, డిప్యూటీ డైరెక్టర్ సురేశ్‌కుమార్, లయన్స్ క్లబ్ ప్రాంతీయ కార్యదర్శి విద్యాభూషన్, లక్ష్మీకుమారి, సుభద్రారాణి, రామ్రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.
విద్యార్థులు జాబ్‌మేళాల్లో పాల్గొన్నప్పుడే… ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు తెలుస్తాయన్నారు. ఇంటర్యూల్లో పాల్గొన్నప్పుడు భయం పోతుందని, మరోసారి ఉన్నతంగా సిద్ధం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. జాబ్‌మేళాలో పాల్లొన్న ఆయా సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ప్రైవేట్ బ్యాంక్‌లు, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి.. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను అగిడితెలుసుకున్నారు. ఆనంతరం ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పొందినవారికి నియామక పత్రాలు అందించారు.