ఉప్పల్-నారపల్లి కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ జీవోను విడుదల చేశారు. కాప్రా మున్సిపల్ చైర్మన్‌గా, ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారి రాజిరెడ్డి అందించిన సేవలను ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో కొనియాడింది.
సిటీబ్యూరో: ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ జీవోను విడుదల చేశారు. కాప్రా మున్సిపల్ చైర్మన్‌గా, ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారి రాజిరెడ్డి అందించిన సేవలను ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో కొనియాడింది.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని, నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలని స్థానికులు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నుంచి విన్నపాలు వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం, స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పేరుకు సంబంధించి తదుపరి చర్యలు తక్షణమే తీసుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

