కాప్రా : త్యాగానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని కాప్రా డివిజన్ ఓల్డ్ కాప్రా ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక రంజాన్ ప్రార్థనల్లో ఉప్పల్ మైనారిటీ ఇన్చార్జి, కాప్రా ఈద్గా కమిటీ చైర్మన్ బద్రుద్దీన్ ఇతర మత పెద్దలతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సామూహిక రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో మతసామరస్యం, ఆనందం వెళ్లి విరిశాయని అన్నారు. క్రమశిక్షణ దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని ఎమ్మెల్యే చెప్పారు. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ముస్లిం ప్రజలందరికీ ఎమ్మెల్యే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈద్గాలో ఫ్లోరింగ్ పనుల ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని బద్రుద్దీన్, మత పెద్దలు, స్థానికులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.