ఉప్పల్, డిసెంబర్ 29 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం అని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. రామంతాపూర్ డివిజన్లోని పలు కాలనీల్లో రూ.1.97 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, శ్మశానవాటికలో స్టోర్‌రూం పనులను బుధవారం కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతరం పని చేస్తున్నా మని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసా గిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధిపొందేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. కాలనీల అభివృద్ధిలో కాలనీ సంక్షే మ సంఘాలు భాగస్వామ్యం కావాలన్నారు. అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరేవిధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, అధికారులు, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, రేపాక కుమారస్వామి, సంపత్‌రావు, బన్నాల ప్రవీణ్, రామంతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ముస్తాక్, ప్రధాన కార్యదర్శి జేసీబీ రాజు, ఉపాధ్యక్షుడు షాజన్, కుమార్, బాలకుమార్, తదితరులు పాల్గొన్నారు.