BRS | ఉప్పల్/నేరేడ్మెట్: ఉప్పల్ నియోజకవర్గ విజయోత్సవ సభను మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
అలాగే మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతంనగర్ డివిజన్ శ్రీ లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరవుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.