చర్లపల్లి, నవంబర్ 19 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చే యనున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి, పుక్కట్‌నగర్, ఎస్సీ బస్తీ, ముస్లిం బస్తీ, వెంకట్‌రెడ్డినగర్, మధుసూదన్రెడ్డినగర్, ఆఫీసర్స్ కాలనీ, చిన్న చర్లపల్లి , తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారని, కాలనీల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పాండా ల శివకుమార్‌గౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, తాళ్ల వెంకటేశ్‌గౌడ్, గిరిబాబు, సారా అనిల్, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంకిరాల నర్సింహా, రాజేశ్ వంశరాజు, రెడ్డినాయక్, చల్లా వెంకటేశ్, కొమ్ము సురేశ్, సానెం రాజుగౌడ్, కొమ్ము రమేశ్, శ్రీకాంత్‌రెడ్డి, కడియాల బాబు, కడియాల యాదగిరి, ఆనంద్‌రా జుగౌడ్, దర్శనం లక్ష్మయ్య, కడియాల అనిల్, మురళి, పాండు, సోమ య్య, ముత్యాలు, వెంకట్‌రెడ్డి, నజీర్, పుష్పలత, నవనీత, సత్తెమ్మ, లలిత పాల్గొన్నారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ప్రచారంను ఉధృతం చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ పరిసర కాలనీల్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేర్ మణెమ్మ, శోభారాణి, కందుల లక్ష్మీనారాయణ, రజితారెడ్డి, రాజేశ్వరితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రచారంకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని మధుసూదన్రెడ్డినగర్, ఆదర్శనగర్, తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింట ప్రచారం నిర్వహిం చారు. ఉప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని , ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పాండాల శివకుమార్‌గౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, ధనుంజయ్యగౌడ్, కోటిరెడ్డి, కొమ్ము సురేశ్, సానెం రాజుగౌడ్, కొమ్ము రమేశ్, కడియాల యాదగిరి, లక్ష్మారెడ్డి, బుచ్చన్నగారి శ్రీకాంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాఘవరెడ్డి, నర్సింహాగౌడ్, ఆనంద్రాజుగౌడ్, మురళి, పాండు, సోమయ్య, ముత్యాలు, వెంకట్‌రెడ్డి, నజీర్, పుష్పలత, నవనీత, సత్తెమ్మ, లలిత, రాధకృష్ణలతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
రామంతాపూర్, నవంబర్ 19 : ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చిలుకానగర్ డివిజన్ ఆర్యవైశ్యుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన పా ల్గొన్నారు. ఈ సందర్భంగా తమ మద్దతు బండారి ల క్ష్మారెడ్డికి ఉంటుందని ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్‌తోపాటు పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించే బలమైన నాయకుడు బండారి లక్ష్మారెడ్డి అని నాచారం బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ అన్నారు. ఆదివారం ప్రచారంలో భాగంగా నాచారం, ఇందిరానగర్‌లో వాకర్స్ తోకలిసి వాకింగ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రానగర్, రాఘవేంద్రనగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
డివిజన్లోని గుప్తాగార్డెన్లో రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , పసుల ప్రభాకర్‌రెడ్డి అపార్టు మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు. కారు గర్తు కు ఓటు వేయాలని అక్కడి వారికి విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డాక్టర్ బివిచారి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిప్పని సంపత్‌కుమార్ తెలిపారు. ఆది వారం రామంతాపూర్ డివిజన్లోని ఇంటింటా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఓటర్లకు వివరించి.. కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సైదులు మేస్త్రి, సుభాష్, రవి, యాదగిరిరెడ్డి, మురళి, కృష్ణవేణి, దుర్గా, తదితరులు పాల్గొన్నారు.
చిలుకానగర్ మార్వాడీ సంఘంతో ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి సమావేశమైనారు. మార్వాడీ సంఘం వారి పూర్తి మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికే ఇస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుంద న్నారు. ఈకార్యక్రమంలో సంఘం సభ్యులు బన్సీలాల్, మోహన్‌జీ, సంగ్రం, సురేశ్, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, నవంబర్ 19 : ముదిరాజుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ ముదిరాజుల సంఘం అధ్యక్షుడు చెమ్మ సాయికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన .. కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహిళలు మంగళ హారతులతో లక్ష్మారెడ్డికి స్వాగతం పలికారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని అన్నారు.