సుల్తాన్‌బజార్, జూలై 18: మహిళలు ఇండ్లలో తయారు చేసే వస్తువులతో ఈ నెల 20,21వ తేదిలలో రామ్‌కోఠిలోని కచ్చిభవన్లో ైస్టెల్ పిటార ఫ్యాషన్ లైఫ్ ైస్టెల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు క్రియేటివ్ ఆర్ట్స్ ప్రతినిధులు రమారాఠి, వైశాలి ఇనానీ, వినీత బల్దా, మీనల్ సార్దా తెలిపారు. ఈ మేరకు మంగళవారం కోఠిలోని హస్మత్గంజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఎగ్జిబిషన్ పోస్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గృహిణులు ఇంట్లో తయారు చేసిన గృహోపకరణలు, దుస్తువులు, ఇంటీరియర్ వస్తువులు, జ్యువెలరీ, ఫుట్‌వేర్ తదితర వస్తువులతో 100 స్టాళ్లతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఎగ్జిబిషన్లో వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఏకల్ విద్యాలయ చారిటీకి అందించనున్నట్లు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌ను అడిషనల్ డీజీ హోంగార్డ్స్ అభిలాష బిష్ట్, సదరన్ జెమ్ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత ప్రారంభిస్తారని వారు వివరించారు.