మణికొండ, ఫిబ్రవరి 22: పరుగెడుతున్న పోటీ ప్రపంచానికి దీటైన వేదికగా.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పరిపూర్ణ మార్గదర్శిగా.., యువతకు ఒకే సమయంలో బహుళ డిగ్రీలను అందించే ఏకైక విద్యా సంస్థ కేఎల్ యూనివర్సిటీయేనని ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డా.జే.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులకు శనివారం కేవీఎంఆర్ ప్రైడ్ గార్డెన్స్‌లో ‘కేఎల్ యూనివర్సిటీ – నమస్తే తెలంగాణ -తెలంగాణ టుడే దినపత్రిక’ల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు అనేక అంశంపై ‘లక్ష్యం-2025’ పేరుతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డా. జే.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థి భవిష్యత్తులో ఇంటర్మీడియట్ విద్య ఎంతో ప్రధానమైనదన్నారు. ఈ రెండేండ్ల చదువు పూర్తి చేసిన తర్వాత భవిష్యత్తులో వేసే మొదటి అడుగు చాలా కీలకమన్నారు.
ఉన్నత చదువులు ఎక్కడ చదవాలి?
ఇంటర్ పూర్తి కాగానే ఉన్నత ఉద్యోగావకాశాలకు.., ఎలాంటి ఉన్నత చదువులు ఎక్కడ చదవాలి? అనేక అంశాలపై విద్యార్థులకు సవివరంగా తెలిపారు. ఉన్నత చదువులు, మెరుగైన ఉద్యోగావకాశాలను పొందాలనుకునే విద్యార్థులు కేఎల్ యూనివర్సిటీని ధీమాగా ఎంచుకోవచ్చన్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీని నాలుగేండ్ల కష్టపడి చదివితే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్తులో సుఖంగా జీవించే అవకాశాలు ఉంటాయన్నారు. కేఎల్ యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ (బి.టెక్) చదివే విద్యార్థులకు ఒకేసారి రెండు కోర్సులు (డ్యూయల్ డిగ్రీ) చదివేలా అవకాశాలను కల్పిస్తున్నామన్నారు.
ప్రధానంగా బీ టెక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సీఎస్ఈ బ్రాంచ్ ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రాన్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కూడా బీ టెక్ రెండో సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివితే ఉన్నత ఉద్యోగవకాశాలను పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం, పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో మల్టీ డిసిప్లీనరి( బహుళ క్రమశిక్షణ) డిగ్రీ చదివిన వారికే అవకాశాలు అధికంగా వస్తున్నాయని గుర్తుచేశారు. కేఎల్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు అత్యధికంగా రూ.60 లక్షల వేతనం తీసుకుంటున్నారని తెలిపారు. తమ యూనివర్సిటీలో రెండేండ్లు చదువుకున్న విద్యార్థికి, మిగతా రెండు, మూడేండ్లు చదువుతున్న విద్యార్థికి చివరి ఏడాది విదేశాలల్లో తమకు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీలల్లో చదువుకునే అవకాశాన్ని కేఎల్ యూనివర్సిటీ మాత్రమే కల్పిస్తుందన్నారు. తమ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఐదు విదేశీ భాషలను ఉచితంగా నేర్పిస్తున్నట్లు తెలిపారు.
జేఈఈ టాపర్లను ఉచితంగా నాలుగేండ్లు చదివిస్తాం: డా. జే శ్రీనివాసరావు
శ్రీ చైతన్య కళాశాలలో చదువుకుంటూ జేఈఈలో 95 శాతం పర్సంటేజ్ సాధించిన విద్యార్థులకు నాలుగేండ్ల పాటు ఉచితంగా చదివిస్తాం. కచ్చితంగా ప్రతి ఏడాది రూ.30 లక్షల ప్యాకేజీకి తగ్గకుండా వారిని తీర్చిదిద్దుతామని శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా 23 మంది టాపర్ విద్యార్థులకు యూనివర్సిటీ తరపున ప్రత్యేక బహుతులను అందజేసి అభినందించారు. కేఎల్ యూనివర్సిటీలో చేరాలనుకునే వారి కోసం ఆన్లైన్-ఆఫ్‌లైన్ పరీక్షలు ఉం టాయన్నారు. కార్యక్రమంలో నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ఏజీఎం డి.వెంకటేశ్వర్లు, నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ విభాగం ఏజీఎం రాజిరెడ్డి, కేఎల్ యూనివర్సిటీ రీజినల్ మేనేజర్లు కె.రాజేష్, కె.రాజ్యలక్షీ, ప్రతినిధులు జి.గౌతంరెడ్డి, జి.వెంకటేష్, కె.దిలీప్, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మీ కోసం మేమున్నాం.. అన్న భరోసాతో విద్య.. అభినందనీయం
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకుని ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని నార్సింగి క్యాంపస్ శ్రీ చైతన్య కళాశాలల ఏజీఎం డి.వెంకటేశ్వర్లు అన్నారు. శనివా రం నిర్వహించిన సమావేశంలో ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చాలా యూనివర్సిటీలు తమ ప్రమోషన్ల కోసం వివిధ రకాల ఆకర్షణీయమైన ఆఫర్లు పెట్టి విద్యార్థులను చేర్పించుకునేందుకు చొరవచూపుతాయి. కానీ, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురి కాకుండా మీ కోసం.. మేమున్నామంటూ హామీ ఇస్తూ.. నాణ్యమైన విద్యను అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. రెండేండ్లుగా శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీతో ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామన్నా రు. ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలి? ఏ యూనివర్సిటీలో చేరా లి? ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయి? అని తెలుసుకోవడంతో పాటు ప్రతిభావంతులకు తమ వంతుగా సహకారాన్ని అం దించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేఎల్ యూనివర్సిటీ ముందుకు వచ్చిందన్నారు.