Kachiguda | కాచిగూడ, ఏప్రిల్ 3 : రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ చిమ్నా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి (55) ఉప్పుగూడ – యాకుత్పురా రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుని ఒంటిపై ఆకుపచ్చ రంగు చొక్కా, నలుపు పాయింటు ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 8712568495లో సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ సూచించారు.