హైదరాబాద్ : కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలోని కార్వాన్ వద్ద మూసీ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం మూసీలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కుల్సుంపురా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 40 సంవత్సరాలుగా ఉంటుందని పేర్కొన్నారు. అతను దినసరి కూలీ అని పోలీసులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు కూలీ మూసీలో పడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.