హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా యూనివర్సిటీ మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://uohyd.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 31వ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పేర్కొన్నది.
ప్రొఫెసర్ పోస్టులు 16
అసోసియేట్ ప్రొఫెసర్ 31
అసిస్టెంట్ ప్రొఫెసర్ 5
బీసీలు, ట్రాన్స్జెండర్లకు రూ.1000
దివ్యాంగులకు రూ. 500
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను చెక్ లిస్ట్, ఎన్‌క్లోజర్స్‌తో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ సెల్ డిప్యూటీ రిజిస్ట్రార్‌కు చేరేలా పంపాలని తెలిపింది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.