క్లస్టర్ పరిధిలో.. 20వేల మంది అర్హులు

- కొవాగ్జిన్ టీకాలు వేసేందుకు అధికారుల ఏర్పాట్లు
- తొలి రోజున అనూహ్య స్పందన
బంజారాహిల్స్, జనవరి 3: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 15నుంచి 18ఏండ్ల వయస్సు వారికి టీకా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షౌకత్నగర్, శ్రీరాంనగర్, వినాయక్నగర్, బోరబండ తదితర పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన వైద్యశాఖ అధికారులు టీకాలు వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20వేలమంది దాకా అర్హులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 250మందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం 7లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంత్రి హరీశ్రావు చేతులమీదుగా టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడకు వచ్చి వ్యాక్సిన్ల కోసం కొవిన్ యాప్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయంచుకున్నారు. కొవాగ్జిన్ టీకా వేస్తున్నారని, 28 రోజులు దాటగానే రెండో డోసు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీకాలు వేసుకునేలా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లతో పాటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు సూచనలు జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు టీకాలు వేయించేలా అవగాహన కల్పించాలని అధికారులు కోరుతున్నారు. రద్దీని బట్టి కేంద్రాల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

