అమీర్పేట్, నవంబర్ 8: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హర్మోనియం గుర్తుపై పోటీచేస్తున్న కాశీనాథ్(స్వతంత్య్ర అభ్యర్థి) అనే నిరుద్యోగి శనివారం బోరబండ చౌరస్తాలో అరగుండు చేయించుకుని నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా వినూత్న ప్రచారం నిర్వహించాడు.
ప్రజల వద్దకు వెళ్లి కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తున్నారా? వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ వస్తోందా? మహిళలకు రూ.2500 ఆర్థికసాయం వస్తోందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా అంటూ ప్రతిఒక్కరిని కదిలించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు సోమేష్, వసంత, ఆదిత్య తదితరులున్నారు.