అడ్డగుట్ట, ఏప్రిల్ 20 : అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌లో అర్ధరాత్రి పేలుడు శబ్ధ్దాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భూగర్భ విద్యుత్ కేబుల్‌వైర్లు పేలి మంటలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే… సుమారు మూడు సంవత్సరాల క్రితం ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్‌ను సంబంధిత అధికారులు వేశారు.
ప్రస్తుతం 20 రోజుల క్రి తం నూతనంగా సీసీ రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ రోడ్డును తవ్వాడు. అయితే జేసీబీతో రోడ్డును తవ్వే సమయంలో భూమిలో ఉన్న విద్యుత్ వైర్లు బయటపడ్డాయి. ఈ విషయం తెలిసిన విద్యుత్ శాఖ అధికారులు కనీస జా గ్రత్తలు చేపట్టకపోవడంతో ఆదివారం రాత్రి ఉన్నట్టుండి వైర్ల నుంచి శబ్ధాలు వచ్చి మంటలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానిక ప్రజలు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఆ ప్రాంతానికి చెందిన అధికారులు మంటలు తగ్గిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం కూడా వైర్లు అలాగే బయటికి ప్రమాదకరంగా ఉన్నాయని, అయిన కూడా అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా సమస్య ఉత్పన్నమవడానికి ప్రధాన కారణమని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సదరు కేబుల్ వైర్లను సరిచేసి.. ప్రమాదం లేకుండా ఏర్పాటు చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆజాద్ చంద్రశేఖర్‌నగర్ ప్రజలు కోరుతున్నారు.