సిటీబ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్యల పరంపర కొనసాగుతున్నది. విస్తృత తనిఖీల్లో భాగంగా గురువారం నగరంలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
హైకోర్టు రోడ్డు సమీపంలోని మహాలక్షీ టిఫిన్ సెంటర్, భాటియా హోటల్ చిప్స్, హస్మత్ హాట్ చిప్స్, మర్వాడీ హాట్ చిప్స్, ఎంజీబీఎస్‌లోని శక్తి సాగర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, మలక్‌పేటలోని అపేక్ష ఎంటర్ ప్రైజెస్, కృపా మార్కెట్, చాంద్రాయణగుట్టలోని సిద్ది వినాయక ఎంటర్ ప్రైజెస్, బాబానగర్‌లో బర్రిటో ఐస్ క్రీమ్, జూబ్లీహిల్స్‌లోని ఆర్కే ఎంటర్ ప్రైజెస్, కాప్రాలోని లక్షీ డైరీ ప్రొడక్ట్స్, బ్రూవర్స్ కెటిల్, ఎంఎస్ హాస్టల్, మారుతీ హాస్టల్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమయంలో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని లోపాలను గుర్తించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.