హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం శుభకృత్ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో పంచాంగ పఠనం నిర్వహించారు. వివిధ ఆలయాల వేదపండితులు పంచాంగాన్ని, ఉగాది విశిష్టతను వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్ పలువురు ప్రముఖులను సత్కరించారు.
సన్మానం పొందిన వారిలో నిజామాబాద్ జిల్లా చౌటుపల్లి ఓంకారేశ్వరస్వామి ఆలయానికి చెందిన గురుమంచి చంద్రశేఖరశర్మ, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్‌కు చెందిన విజయభాస్కరశర్మ, అమ్మాపూర్ కురుమూర్తి ఆలయానికి చెందిన అరుణ్‌కుమార్ పాండే, కొండగడప శ్రీవిద్య శ్రీధరశర్మ, మధుసూదన్‌శర్మ, నందకిషోర్శర్మ, ఖానాపూర్ వాసుదేవాచార్యులు, ఆకారంమఠం భద్రయ్య, అర్చకులు వెంకటాద్రి, భద్రినాథాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, పాల శంకరశర్మ, ఎన్.ప్రహ్లాద్, నర్సింహమూర్తి, మామిడిపల్లి రాములు, సంగనభట్ల నరహరిశర్మ, అనిల్‌కుమార్, జేసీ మోహన్‌శర్మ ఉన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులకు రూ.10,116 పారితోషకంతో సత్కరించారు.
వీరిలో రాజేశ్వరశర్మ, స్థపతి వేలు, దేవరుప్పల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాల్‌రెడ్డి, శిల్పి గోపాల్‌రెడ్డి ఉన్నారు. భజంత్రీలు భద్రాద్రి షేక్ మౌలానా సాహెబ్, ధర్మపురి సురేశ్‌బాబు, బాసరకు చెందిన కుమారి, వ్యాఖ్యాత దక్షిణమూర్తి ఉన్నారు.